Radhe Shyam: మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకు వెళ్తున్న "రాధే శ్యామ్"

Radhe Shyam: చాలాకాలం తరువాత ప్రభాస్ నటించిన ప్రేమకథా చిత్రం ఇది.

Shireesha
Published on: 12 March 2022 1:11 PM IST
Radhe Shyam Huge Collections on First Day | Radhe Shyam Collections
X

Radhe Shyam: మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకు వెళ్తున్న "రాధే శ్యామ్" 

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఫాంటసీ ప్రేమకథ రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలాకాలం తరువాత ప్రభాస్ నటించిన ప్రేమకథా చిత్రం ఇది. భాగ్యశ్రీ, మురళి శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన మార్చి 11, 2022 న విడుదలైంది.

మరి ఈ సినిమా కలెక్షన్ల పై ఒక లుక్కేయండి. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ప్రముఖ హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ని అందుకున్న ఈ సినిమా ప్రీమియర్‌ తోనే 904 K డాలర్లు వసూలు చేసిందట. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ కారణంగా అక్కడ విడుదలకు ముందే ఎక్కువ టికెట్స్‌ అమ్ముడయ్యాయి.

ఇక అప్పటికే ఉన్న హాలీవుడ్ సినిమాలతో పోటీపడి ప్రభాస్ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే చిత్రం రూ. 30 కోట్లు వసూళ్ల రాబట్టింది. ఒక్క నైజాంలోనే మొదటి రోజు రూ.11.87 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఇక ఆంధ్రాలో రూ.8.5 కోట్లను రాబట్టిన "రాధే శ్యామ్" బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను చేసింది.

Shireesha

Shireesha

Next Story