Radhe Shyam: ఫైనల్ రన్ పూర్తి చేసుకున్న "రాధేశ్యామ్".. తక్కువ కలెక్షన్లతో...

Radhe Shyam: థియేటర్ల నుంచి వెళ్లి పోతున్న "రాధేశ్యామ్"...

Shireesha
Published on: 23 March 2022 12:50 PM IST
Radhe Shyam Going to Complete Final Run with fewer Collections | Tollywood News
X

Radhe Shyam: ఫైనల్ రన్ పూర్తి చేసుకున్న "రాధేశ్యామ్".. తక్కువ కలెక్షన్లతో...

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా భారీ అంచనాల మధ్య రాధాకృష్ణ దర్శకత్వంలో మార్చి 11న థియేటర్లలో విడుదలైన సినిమా "రాధేశ్యామ్". ఎంత భారీ అంచనాల మధ్యన విడుదల అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటూ వస్తోంది.

అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయిన "రాధేశ్యామ్" సినిమా అతి తక్కువ సమయంలోనే తన ఫైనల్ రన్ ను చాలావరకు థియేటర్లలో పూర్తి చేసుకోబోతోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఓవర్సీస్ లో కూడా సినిమా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ఓవర్సీస్ లో అమెరికాలో థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న "రాధేశ్యామ్" సినిమా కేవలం 2.04 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

దీంతో డిస్ట్రిబ్యూటర్లు చాలావరకు నష్టపోయారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ ఒక హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించారు. టీజర్ మరియు ట్రైలర్ ల తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను మాత్రం ఏమాత్రం మెప్పించలేకపోయింది.

Shireesha

Shireesha

Next Story