Radhe Shyam: దసరా బరిలో ప్రభాస్ 'రాధేశ్యామ్'

Radhe Shyam eyeing for a Dussehra release?
x

రాధే శ్యామ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Radhe Shyam: రాధే శ్యామ్' సినిమా విడుదల కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Radhe Shyam: కరోనా సెకండ్ వేవ్ తో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.

ఆ నెలలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. వీటితో పాటు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి పాన్-ఇండియన్ సినిమాల వరకు అన్నీ వాయిదా పడ్డాయి. 'రాధే శ్యామ్' సినిమా విడుదల కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకు ముందెన్నడూ చూడని ప్రేమకథగా పేరుపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30 న థియేటర్లలోకి రానుంది. కానీ, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానున్నాయి. దీంతో విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అయితే పరిస్థితి చక్కబడితే.. ఈ ఏడాది దసరాకు సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో విడుదల కానుంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ నిర్మించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories