Radhe Shyam: రాధేశ్యామ్ ఓటీటీ డీల్ ఫైనల్

Radhe Shyam Digital Rights Acquired by Zee5
x

Radhe Shyam:(File Image) 

Highlights

Radhe Shyam: రాధేశ్యామ్ మూవీ డిజిటల్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అయ్యినట్టు తాజా సమాచారం.

Radhe Shyam: బాహుబలి బంపర్ హిట్ తర్వాత సాహో లాంటి ఫ్లాప్ ఇచ్చాడు ప్రభాస్. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్స్ తర్వాతి ప్రాజెక్టు కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అదే రాధేశ్యామ్. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో.. ఇది కూడా భారీ బడ్జెట్ తో రెడీ చేస్తున్నారు. అందులో పూజాహెగ్డే హీరోయిన్.. జిల్ లాంటి కమర్షియల్ హిట్ గోపీచంద్ కు ఇచ్చిన రాధాకృష్ణకుమార్ దే ఈ ప్రాజెక్ట్. కేవలం కథ నచ్చి ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నాడనే వార్తలున్నాయి. అందుకే ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ సెట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్. ఈ రాధే శ్యామ్ సినిమాను కూడా సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

ఆ మధ్య విడుదలైన టీజర్‌లో ప్రభాస్ సూపర్ కూల్ లుక్‌లో అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ లోని మాస్ నే చూసారు ఇప్పుడు అతనిలో ప్రేమను చూడండి అంటూ ఒక ప్రీ టీజర్ తో టీజ్ చేశారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి ఇటీవల ఓటిటి డీల్స్ నడుస్తున్నాయని బజ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అయ్యినట్టు తాజా సమాచారం. ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది.

ఇక మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ షూట్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాకు సంగీతం అందించాడు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories