భారీ మొత్తానికి అమ్ముడైన రాధేశ్యామ్ డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఫాంటసీ ప్రేమకథ రాధేశ్యామ్...

Arun Chilukuri
Updated on: 7 March 2022 4:00 PM IST
Radhe Shyam Digital and Satellite Rights
X

భారీ మొత్తానికి అమ్ముడైన రాధేశ్యామ్ డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఫాంటసీ ప్రేమకథ రాధేశ్యామ్ ఈనెల 11న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది. రోజులు గడిచే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి కానీ ఏ మాత్రం తగ్గటం లేదు. చాలాకాలం తరువాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగులో మాత్రమే కాక మరికొన్ని భారతీయ భాషల్లో కూడా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ, మురళి శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జీ ఛానల్ వారు ఏకంగా 150 కోట్లు చెల్లించి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డిజిటల్ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే సినిమా హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను మాత్రం నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను యు.వి.క్రియేషన్స్ మరియు టీ సిరీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story