Radhe Shyam: ప్రభాస్ "రాధేశ్యామ్" కి సెన్సార్ సర్టిఫికేట్

Radhe Shyam Censor Report
x

Radhe Shyam: ప్రభాస్ "రాధేశ్యామ్" కి సెన్సార్ సర్టిఫికేట్

Highlights

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్".

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడో సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కేసుల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా సినిమాని మార్చ్ 11 న థియేటర్ లలో విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తిచేసుకుంది.

భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, సచిన్ ఖెడేకర్, తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత ప్రభాస్ కెరీర్లో నటిస్తున్న ఒక ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఫాంటసీ ప్రేమకథగా పీరియడ్ బ్యాక్ డ్రాప్తో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఆదిత్య అనే ఒక హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories