Raashi Khanna: టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా మారిన రాశి ఖన్నా?

Raashi Khanna: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ గల హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు.

Venkata Chari
Published on: 15 April 2021 3:34 PM IST
Raashi Khanna Turns TV Serial Artist for Pakka Commerical Movie
X

రాశి ఖన్నా (ఫొటో ట్విట్టర్)

Raashi Khanna: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ గల హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. బాక్సాఫీస్ వద్ద నిలబడేందుకు, స్టార్ హీరోయిన్ హోదా కోసం ఈ యువ హీరోయిన్ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రతి సినిమాలో చాలా కష్టపడుతోంది. కానీ, తనకు మాత్రం సరైన గుర్తింపు మాత్రం రావడంలేదు. తాజాగా, రాశి ఖన్నా మరలా మారుతితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది.

'ప్రతి రోజూ పండగే' సినిమాలో మారుతి డైరెక్షన్ లో రాశి ఖన్నా నటించింది. ఈ సినిమాలో ఆమె ఏంజెల్ ఆర్నా పాత్రను పోషించింది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో చేయబోయే మరో సినిమాలో టీవీ సీరియల్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఆమె న్యాయవాదిగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఈమేరకు ఓ చిత్రాన్ని పోస్ట్ చేసింది, ఆ ఫొటోలో రాశి ఖన్నా న్యాయవాదిగా కనిపించింది.

కాగా, ఈ చిత్రంలో గోపిచంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అని పేరు పెట్టారు. యూవీ క్రియేషన్స్, జీఓ 2 ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story