చిరంజీవితో మెగా ప్రాజెక్టు చేయబోతున్న ప్రముఖ నటి

*చిరంజీవితో మెగా ప్రాజెక్టు చేయబోతున్న ప్రముఖ నటి

Rama Rao
Published on: 2 May 2022 1:11 PM IST
Raadhika Sarathkumar is Planning a Movie with Chiranjeevi
X

చిరంజీవితో మెగా ప్రాజెక్టు చేయబోతున్న ప్రముఖ నటి

Raadhika Sarathkumar: ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా థియేటర్లలో విడుదల అయింది కానీ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది. చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన సినిమా ఇలా డిజాస్టర్ గా మారడంతో అవి మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే మెగాస్టార్ మాత్రం ప్రస్తుతం చేతిలో బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ కలిసి చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

ఒకప్పుడు వీరిద్దరి అన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి అభిమానులు ఫిదా అయ్యే వాళ్ళు. తాజాగా రాధిక చేసిన ఒక అధికారిక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయడం అనే ఒక బ్యానర్ ను స్థాపించిన రాధిక తన సొంత బ్యానర్ లో ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. గతంలో రాధిక తన బ్యానర్లో చిరంజీవి హీరోగా ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నట్లు గా చాలా సందర్భాల్లో చెప్పారు.

ఇన్నాళ్లకు ఆమె చిరు తో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. నిజానికి రాధిక తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది చిరంజీవి హీరోగా నటించిన "న్యాయం కావాలి" సినిమాతోనే. ఇప్పుడు రాధిక నిర్మాతగా చిరంజీవి హీరోగా సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story