R Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి ఇంట విషాదం..

R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇంట విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 5 July 2022 3:59 PM IST
R Narayana Murthy Mother Passes Away
X

R Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి ఇంట విషాదం..

R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ(93) మృతి చెందారు. ఆమెకు ఏడుగురు సంతానం. వారిలో మూడవ కుమారుడు ఆర్. నారాయణ మూర్తి. ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా కాకినాడ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. నారాయణమూర్తి తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తల్లి అంత్యక్రియలు జరుగనున్నాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story