ఆర్ నారాయణ మూర్తి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న అభిమానులు

ఆయన నిజంగానే పీపుల్ స్టార్ అంటున్న అభిమానులు

admin1
Updated on: 31 Dec 2021 5:00 PM IST
R Narayana Murthy Met AP Minister Perni Nani on the issue of AP theaters
X

ఆర్ నారాయణ మూర్తి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న అభిమానులు

R Narayana Murthy: పీపుల్ స్టార్ గా పిలవబడే ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన పేర్ని నాని ని కలవడం జరిగింది. మినిస్టర్ తో ఆంధ్రప్రదేశ్లోని థియేటర్ల టికెట్ రేట్ల గురించి మాట్లాడారు నారాయణమూర్తి. థియేటర్ల ఇష్యూ ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయాల్సిందిగా కోరారు ఆర్ నారాయణమూర్తి. గతంలో కూడా గవర్నమెంటు థియేటర్ ఓనర్ల తో మరియు మేనేజ్మెంట్ తో చాలాసార్లు ఈ విషయంలో లో మాట్లాడటం జరిగిందని కానీ చాలామంది టికెట్ రేట్ల గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంప్రదించారని నాని పేర్కొన్నారు.

"ముందే మా దగ్గరికి వచ్చి ఉంటే మేము మేము అన్ని ప్రాబ్లమ్స్ ని తీర్చి ఉండేవాళ్ళం" అని ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతూ అన్నారు నాని. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సీజ్ చేయబడిన 83 థియేటర్లకు రీఓపెన్ చేసేందుకు నాలుగు వారాల లోపు పర్మిషన్లు వస్తాయని అన్నారు. ఏదేమైనప్పటికీ మిగతా హీరోలతో పోలిస్తే ఆర్.నారాయణమూర్తి స్వయంగా వెళ్లి మినిస్టర్ తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్.నారాయణమూర్తి నటించిన సినిమాలు ఏవీ ఇప్పుడు విడుదలకి సిద్ధంగా లేవు. అయినా సరే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన స్టాండ్ తీసుకోవటం గొప్ప విషయం అని అభిమానులు ఆయనను కొనియాడుతున్నారు. నారాయణ మూర్తి ని అందరూ పీపుల్స్ అనడంలో అతిశయోక్తి లేదని అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

admin1

admin1

Next Story