R Narayana Murthy: తన 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు ఆర్.నారాయణమూర్తి

R Narayana Murthy: తన 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు ఆర్.నారాయణమూర్తి

admin1
Updated on: 14 Feb 2022 2:51 PM IST
R Narayana Murthy Donated His 12 Acres of Land | Telugu Movie News
X

R Narayana Murthy: తన 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు

R Narayana Murthy: నటుడిగా మాత్రమే కాక దర్శకుడిగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్.నారాయణమూర్తి. ఎప్పుడూ సమాజం గురించి, అందులో ఉండే లోటు బాట్ల గురించి సినిమాలు తెరకెక్కించే నారాయణమూర్తి చాలా సినిమాల్లో నటించారు కూడా. రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి కాలేజ్ లో చదువుకునేటప్పుడు విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా పని చేశారు. తిండి, వసతి కూడా లేక మద్రాస్ లో ఉండేటప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

బీఏ చేసిన నారాయణమూర్తి స్నేహితుల సాయంతో "అర్ధరాత్రి స్వాతంత్రం" అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు కూడా తనకి ఇల్లు, కారు లాంటివి లేకపోయినా 12 ఎకరాల భూమిని దానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నారాయణమూర్తి తల్లి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కొడుకు ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోమని చెప్తే వినలేదని ఆమె అన్నారు. ఇక నారాయణ మూర్తి కి చేపల పులుసు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టమని ఆమె తెలిపారు.

admin1

admin1

Next Story