తప్పు నాది కాదు, శృతి హాసన్ దే!

Ruthvik
Published on: 2 April 2019 11:48 AM IST
తప్పు నాది కాదు, శృతి హాసన్ దే!
X

పీవీపీ.. తెలుగు సినిమా పరిశ్రమ లో పేరున్న నిర్మాత. ఆయన నిర్మాత గా పెద్దగా విజయం చూసింది లేదు కానీ కొన్ని ప్రతిష్టాత్మక సినిమాల ని మాత్రం నిర్మించారు. చాలా వరకు సినిమాల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు పీవీపీ. ఈయన ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తుండడం తో ప్రత్యర్థులు ఆయన పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే గతంలో పీవీపీ హీరోయిన్ శృతి హాసన్ తో ఒక వివాదం లో ఉండిపోయారు. దానిని తిరిగి తోడుతూ ప్రత్యర్థులు ఆయన పై దాడి చేస్తున్నారు. గతంలో పీవీపీ శృతి హాసన్ ని ఆర్ధిక వ్యవహారాల్లో బెదిరించారు అని వస్తున్న కామెంట్స్ పై పీవీపీ క్లారిటీ ఇచ్చారు. "గతంలో నేను తీసిన ఊపిరి అనే సినిమా లో శృతి చేయాల్సి ఉంది కానీ ఆవిడ షూటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోవడం తో ఆవిడ కి ఇచ్చిన పారితోషికం వెనక్కి తీసుకున్నాము కానీ నేను ఎక్కడా ఆవిడని బెదిరించలేదు. ఆ విషయం లో అసలు నా తప్పేమి లేదు. సమంత, అనుష్క,తమన్నా కూడా మా తో పని చేశారు కానీ వారు ఎప్పుడూ నా మీద అభియాగాలు మోపలేదు. నా మీద అనవసరం గా బురద చల్లడం ఆపితే మంచిది." అని ఆయన అన్నారు.

Ruthvik

Ruthvik

Next Story