Pushpa:'ఆర్‌ఆర్‌ఆర్' స్లాట్‌ లో 'పుష్ప' రిలీజ్?

Pushpa: ఎస్ఎస్ రాజమౌళి రాబోయే సినిమా 'ఆర్ఆర్ఆర్' నిస్సందేహంగా టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి.

Venkata Chari
Published on: 11 May 2021 6:50 PM IST
Pushpa to take up RRR slot?
X

ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప (ఫొటో ట్విట్టర్)

Pushpa: ఎస్ఎస్ రాజమౌలి రాబోయే సినిమా 'ఆర్ఆర్ఆర్' నిస్సందేహంగా... టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా, ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అయింది.

సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ 2021 అక్టోబర్ 13 న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను జనవరి 2022 లేదా 2022 సమ్మర్ కు వాయిదా వేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.

మరోవైపు, ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలను 2022 కి పోస్ట్‌ఫోన్ చేస్తే.. అల్లు అర్జున్ రాబోయే చిత్రం 'పుష్ప' ని 2021 అక్టోబర్ 13 న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సినిమా ఈ ఏడాది ఆగస్టు 13 న విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడింది.

Venkata Chari

Venkata Chari

Next Story