అదే రోజున విడుదల కాబోతున్న పుష్ప పార్ట్ -2

Pushpa The Rule:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

admin1
Published on: 2 Feb 2022 4:18 PM IST
Pushpa The Rule Release Date Locked
X

అదే రోజున విడుదల కాబోతున్న పుష్ప పార్ట్ -2

Pushpa The Rule:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయి తన పాత్రకి ప్రాణం పోశారు. ఇక ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప: ది రూల్". ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మరియు తన తండ్రితో ఉండే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, అల్లు అర్జున్ అన్నదమ్ముల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ని ఫిబ్రవరి నుంచి సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. "పుష్ప: ది రైజ్" గతేడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే "పుష్ప: ది రూల్" ను కూడా ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళం స్టార్ ఫాహాద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య విలన్ గా కనిపించనున్నారు. సునీల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

admin1

admin1

Next Story