రష్యాలో కూడా తగ్గేదేలే.. రష్యాలో 'పుష్ప' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

Pushpa: The Rise to Release in Russia on December 8
x

రష్యాలో కూడా తగ్గేదేలే.. రష్యాలో ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

Highlights

Pushpa: ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలపై ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.

Pushpa: ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలపై ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలన్నీ వేరే దేశాలలో కూడా విడుదల కి సిద్ధమవుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల తరువాత తాజాగా ఈ జాబితాలో చేరిన సినిమా "పుష్ప పార్ట్ 1". క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఏ మాత్రం అంచనాలు లేకుండానే హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా కాసుల వర్షం కురిపించింది. అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా బోర్డర్లు దాటి రష్యాలో కూడా విడుదల కాబోతోంది. ఈ మధ్యనే ఈ చిత్ర రష్యన్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

రష్యాలో డిసెంబర్ 8వ తేదీ నుంచి థియేటర్లలో కి రాబోతోంది. ఇక మరోవైపు ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న మాస్కోలో మరియు డిసెంబర్ మూడవ తేదీన సెంట్ పీటర్స్ బర్గ్ లో కూడా పుష్ప సినిమాని స్క్రీన్ చేయబోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సృష్టించిన ఈ సినిమా రష్యాలో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహధ్ ఫాసిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories