Pushpa on Prime: "పుష్ప" డిజిటల్ విడుదల కు తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

Pushpa on Prime: భారీ అంచనాల మధ్య విడుదలైన "పుష్ప" సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 5 Jan 2022 1:53 PM IST
Pushpa the Rise Movie is Going to Stream in Amazon Prime on January 7th 2022 | Tollywood News
X

Pushpa on Prime: "పుష్ప" డిజిటల్ విడుదల కు తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

Pushpa on Prime: స్టైలిష్ స్టార్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒక వైపు భారీ కలెక్షన్లతో "పుష్ప" బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు ఈ సినిమా నుంచి తొలగించబడిన కొన్ని సన్నివేశాలని మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియాలో విడుదల చేయగా అవికూడా వైరల్ గా మారాయి.

మరోవైపు పాటలకి కూడా ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. అయితే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమాను జనవరి 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన "పుష్ప" డిజిటల్ ప్లాట్ఫారమ్స్ లో కూడా అదే రేంజిలో ఆదరణ పొందుతుంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి సంబందించిన రెండవ పార్ట్ "పుష్ప: ది రూల్" అనే టైటిల్ తో దసరా లేదా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

admin1

admin1

Next Story