Pushpa Movie: కేరళలో స్పెషల్ షోలు ఏర్పాటు చేస్తున్న "పుష్ప" చిత్రబృందం

*పుష్ప కేరళ అభిమానుల కోసం స్పెషల్ షో లు

admin1
Updated on: 20 Nov 2021 7:00 PM IST
Pushpa Movie Team Planning to Special Movie Shows For Kerala Fans
X

కేరళలో స్పెషల్ షోలు ఏర్పాటు చేస్తున్న పుష్ప చిత్రబృందం

Pushpa Movie: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళం సినీ ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మలయాళ అభిమానులు అల్లు అర్జున్ ని ప్రేమగా 'మల్లు' అర్జున్ అని పిలుచుకుంటారు. మలయాళం ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ తదుపరి సినిమా అయిన "పుష్ప" విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప చిత్ర బృందం ఈ సినిమాకు కేరళ లో కూడా భారీ విడుదలని ప్లాన్ చేస్తోందట. తాజా సమాచారం ప్రకారం కేవలం కేరళలో మాత్రమే పుష్ప విడుదల తేదీన 40 ఫ్యాన్ షో లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వీటికి సంబంధించిన టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక అల్లు అర్జున్ కోసం మాత్రమే కాకుండా ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫాహాధ్ ఫాసిల్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుండడంతో ఈ సినిమాకి మలయాళంలో కూడా బాగానే క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 17వ తారీఖున తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story