Pushpa Movie Release Date: కుదిరితే 'దసరా' లేదంటే 'క్రిస్మస్'కే పుష్ప?

Pushpa: కుదిరితే 'దసరా' లేదంటే 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

Kranthi
Updated on: 1 May 2021 2:46 PM IST
Pushpa Release Date Postponed
X

పుష్ప మూవీ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Pushpa Movie Release Date: సుకుమార్ విభిన్నమైన కథలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమాను అడవి నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, హీరోకి చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రను ఫహాద్ ఫాజిల్ పోషిస్తున్నాడు.

ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకపోవచ్చని అనుకుంటున్నారట. అందువలన కుదిరితే 'దసరా' బరిలోకి దింపాలనీ .. లేదంటే 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇతర సినిమాల విడుదల తేదీలను బట్టి, ఈ విషయంలో ఇంకా మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ ప్రస్తుతమైతే ఈ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. జూన్ నాటికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పుష్పరాజ్‌గా చేతిలో గొడ్డలితో ఊరమాస్‌ లుక్‌లో కనిపించి అభిమానులతో ఈలలు వేయించాడు బన్నీ. తను అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఓ రకంగా పూనకాలే తెప్పించాడు దేవిశ్రీ ప్రసాద్‌. తాజాగా ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది. అత్యంత తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను చేరుకున్న తెలుగు టీజర్‌గా 'పుష్ప' రికార్డుకెక్కింది.

దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతూ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఈ బన్నీనా? మజాకా? అంటూ నెట్టింట తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోని రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో 50 మిలియన్ల వ్యూస్‌ను చేరుకునేందుకు 6 నెలలు పట్టింది. కానీ బన్నీ మాత్రం కేవలం 20 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

Kranthi

Kranthi

Next Story