Pushpa: పుష్ప రాజ్ పాత్ర చేయడం చాలా కష్టం అంటున్న ప్రొడక్షన్ డిజైనర్

భవిష్యత్తులో "పుష్ప" లాంటి అంటే సినిమాని ఎవరూ తీయలేరు ఏమో అంటున్న డిజైనర్

admin1
Updated on: 15 Dec 2021 1:16 PM IST
Pushpa Movie Production Designer Says its Very Difficult to Play the Role of Pushpa Raj in an Interview | Movie News
X

పుష్ప రాజ్ పాత్ర చేయడం చాలా కష్టం అంటున్న ప్రొడక్షన్ డిజైనర్ (ఫైల్ ఫోటో)

Pushpa Movie: భారీ అంచనాల మద్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "పుష్ప: ది రైజ్". తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న రామకృష్ణ మరియు మౌనిక లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. సినిమాలో బన్నీ తో పాటు మిగతా కొన్ని ఇతర పాత్రల కోసం పదిహేను లుక్స్ డిజైన్ చేశారట. "అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్ చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే జుట్టు దగ్గర్నుంచి కాళ్ళ వరకు అల్లు అర్జున్ మొత్తం మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా కొన్ని గంటల సేపు ఉండాల్సి వస్తుంది. పైగా షూటింగ్ రెండేళ్లపాటు జరిగింది" అని వారన్నారు.

"అల్లు అర్జున్ కి ఒక అసిస్టెంట్ ఉండే వాళ్ళు. వారు బన్నీ ని తల దగ్గర నుంచి కాళ్ల వరకూ అన్ని ఫోటోస్ తీసేవారు. తరువాతి రోజు బన్నీ వచ్చి ఆ ఫోటోలన్నీ చెక్ చేసి ఈరోజు కూడా అన్ని ఉన్నాయా లేక ఏదైనా చోట మేకప్ మిస్ అయ్యారా అని జాగ్రత్తగా చూసుకునే వారు. పుష్ప రాజ్ పాత్ర చేయడం చాలా కష్టమైన పని. సినిమా షూటింగ్ కోసం లొకేషన్లను వెతికే పనిలో కూడా మేము అడవిలో వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు వర్షాలు పడ్డాయి, రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. ఇలా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇలాంటి సినిమాని మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఎవరు చేయలేరు ఏమో" అని అన్నారు మౌనిక.

admin1

admin1

Next Story