Pushpa Movie: డిస్ట్రిబ్యూటర్లకు 8 కోట్లు తిరిగి ఇచ్చేసిన "పుష్ప" నిర్మాతలు

Pushpa Movie: రికార్డులు సృష్టిస్తున్న పుష్ప కలెక్షన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి...

admin1
Updated on: 7 Jan 2022 4:01 PM IST
Pushpa Movie Producers Returned 8 Crore Money to Distributors | Tollywood News
X

Pushpa Movie: డిస్ట్రిబ్యూటర్లకు 8 కోట్లు తిరిగి ఇచ్చేసిన "పుష్ప" నిర్మాతలు

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన "పుష్ప: ది రైజ్" సినిమా విడుదలైన మొదటి రోజు పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. రికార్డులు సృష్టిస్తున్న పుష్ప కలెక్షన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు లో కలెక్షన్లు తగ్గుతున్నప్పటికీ మాత్రం పరభాషలో మాత్రం పుష్ప తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది.

అన్ని భాషల్లోనూ కలిపి పుష్ప కలెక్షన్లు 150 కోట్ల మార్కును దాటి నట్లు తెలుస్తోంది. "అల వైకుంఠ పురం లో" సినిమా తర్వాత ఈ రేంజ్ లో కలెక్షన్లు అందుకున్న అల్లు అర్జున్ సినిమా "పుష్ప". కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పుష్ప కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లోని డిస్ట్రిబ్యూటర్లకు చిత్ర నిర్మాతలు కొంత డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నట్లు సమాచారం.

యూఏ, ఈస్ట్, గుంటూరు ఏరియాల్లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు 8 కోట్లు తిరిగి ఇచ్చేయటం విశేషం. ఇక నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటిదాకా 80 శాతం కలెక్షన్లు వచ్చాయి కాబట్టి వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అయినప్పటికీ నిర్మాతలు ఇలా డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేయడం చాలా ప్రశంసనీయం అని చెప్పచ్చు.

admin1

admin1

Next Story