Pushpa Movie: భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసి షాక్ ఇచ్చిన "పుష్ప" మేకర్స్

Pushpa Movie: భారీ ఆఫర్ కాదనుకున్న "పుష్ప" నిర్మాతలు

admin1
Published on: 25 Jan 2022 1:09 PM IST
Pushpa Movie Makers Rejecting Huge Offer | Telugu Movie News
X

భారీ ఆఫర్ కాదనుకున్న "పుష్ప" నిర్మాతలు

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్". ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా హిందీలో విడుదలైన పుష్ప సినిమా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేసి అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ గారు పుష్ప నిర్మాతలకి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారట.

అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ కోసం వారు ఏకంగా 400 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారట. అయితే ఇది కేవలం థియేట్రికల్ రైట్స్ వరకు మాత్రమే. ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ఇందులో రావు. సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఇంత పెద్ద రావడం నిజంగా గొప్ప విషయమే. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం ఈ ఆఫర్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కూడా హిందీలో భారీగానే మార్కెట్ ఉండబోతోందని ఇంతకంటే పెద్ద అమౌంట్ వచ్చే అవకాశాలు ఉండడంతో వారు రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

admin1

admin1

Next Story