Pushpa Pre Release Event: దుబాయ్ లో జరగనున్న "పుష్ప" ప్రీ రిలీజ్ ఈవెంట్

*దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న "పుష్ప" దర్శకనిర్మాతలు

admin1
Updated on: 11 Nov 2021 2:30 PM IST
Pushpa Pre Release Event: దుబాయ్ లో జరగనున్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
X

Pushpa Pre Release Event: దుబాయ్ లో జరగనున్న "పుష్ప" ప్రీ రిలీజ్ ఈవెంట్

Pushpa Pre Release Event: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమాలోని మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమాని విడుదల చేయాల్సిందిగా దర్శక నిర్మాతలు ఖరారు చేసారు.

ఇంకా విడుదలకి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారు. అయితే తాజా సమాచారం అయితే ప్రకారం సినిమాపై హైప్ పెంచేందుకు అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన ఈవెంట్లను వివిధ ప్రదేశాల్లో లో ప్లాన్ చేద్దామని చెప్పారట.

దీంతో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో జరపడానికి సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్ లో జరగబోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ గా ఈ సినిమాలో అల్లుఅర్జున్ ఒక ఆసక్తికరమైన పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడనున్నారు.

అనసూయ, సునీల్ మరియు ఫాహద్ ఫాసిల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story