Rashmika Mandanna: సైలెంట్ గా కౌంటరేసిన రష్మిక

Rashmika Mandanna: నెటిజన్ నోరు మూయించిన రష్మిక మందన్న

admin1
Updated on: 17 Dec 2021 3:59 PM IST
Rashmika Mandanna React the Trolls
X

నెటిజన్ నోరు మూయించిన రష్మిక మందన్న(ఫైల్-ఫోటో)

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో సైతం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రష్మిక తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది రష్మిక. ఈ సినిమాలోని సామి సామి పాట కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది రష్మిక. కానీ పాట చూసిన తర్వాత అందరూ ఆమె పై ప్రశంసల వర్షం కురిపించారు అని రష్మిక అన్నారు. కానీ ఈ వీడియో కి రియాక్ట్ అయ్యి ఒక నెటిజన్ ఆమెను ట్రోల్ చేశాడు.

"ఈమె ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం" అంటూ కామెంట్ చేశాడు. కానీ అతని పై ఫైర్ అవ్వకుండా రష్మిక సైలెంట్ గా కౌంటర్ వేసింది. "యాక్టింగ్ ఓ ఓవర్ యాక్టింగ్ ఓ. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వేం సాధించావు నాన్నా" అని ఓకే ఒక్క డైలాగుతో అతని నోరు మూయించింది రష్మిక. మరోవైపు రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు, మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story