భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న పుష్ప 2

Pushpa Movie Giving a Shock With Pre Release Business
x

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న పుష్ప

Highlights

* ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తున్న పుష్ప

Pushpa Movie: "పుష్ప: ది రైజ్" సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీ లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాకి సీక్వెల్ అయిన "పుష్ప: ది రూల్" పైన పడింది.

"ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి సినిమాల సక్సెస్ చూసిన తర్వాత "పుష్ప 2" కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం తో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం "పుష్ప: ది రూల్" ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లు చేసినట్లు సమాచారం. అందులో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే 300 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.

ఇక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ థియేట్రికల్ రైట్స్ 200 కోట్లకు అమ్ముడు అవ్వగా హిందీలో కూడా 200 కోట్లకు అమ్ముడయ్యింది. ఇలా సినిమా ఇప్పటికే ఏడు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసుకుంది. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ ఈ సినిమాలో మాట్లాడనున్నారు. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్తో సాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ భరద్వాజ్, సునీల్, ఫాహాధ్ ఫాసిల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories