Pushpa Fourth Single: ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ.. పుష్ప నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌..

Pushpa Fourth Single Mass Song will be Released on November 19
x

Pushpa Fourth Single: ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ.. పుష్ప నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌..

Highlights

Pushpa Fourth Single: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.

Pushpa Fourth Single: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. పుష్ప చిత్రం నుంచి మరో పాటను ప్రేక్షకులకు వినిపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలోని నాలుగో పాట 'ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ'ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్‌గా, ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక న‌ట‌స్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న విడుద‌ల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories