Pushpa Fourth Single: నాలుగో సాంగ్ ప్రోమోతో అడ్డాలోకి అడుగుపెట్టిన "పుష్ప"

Pushpa Fourth Single Mass Song Released Today 16th November 2021 | Pushpa Latest Update
x

Pushpa Fourth Single: ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ.. పుష్ప నుంచి మ‌రో సాంగ్ ప్రోమో రిలీజ్

Highlights

Pushpa Fourth Single: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా...

Pushpa Fourth Single: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. ఇప్పటికే మూడు పాటలు విడుదలై మూడూ కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ఇక తాజాగా నాలుగో సింగిల్ 'ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ' ప్రోమో ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి పూర్తి సాంగ్‌ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఇక ఈ పాట తన ఫేవరెట్ సాంగ్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories