Pushpa Deleted Scene: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పుష్ప డిలీటెడ్ సీన్

Pushpa Deleted Scene: ఆ సీన్ ని డిలీట్ చేసిన పుష్ప నిర్మాతలు

admin1
Updated on: 1 Jan 2022 6:11 PM IST
Pushpa Deleted Scene that Went Viral on Social Media
X

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పుష్ప డిలీటెడ్ సీన్

Pushpa Deleted Scene: భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తొలగించబడిన కొన్ని సన్నివేశాలని మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా నుండి డిలీట్ చేసిన మొదటి సన్నివేశాన్ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కుటుంబ పోషణ కోసం అప్పు తీసుకున్న తన తల్లి ని రెడ్డప్ప అనే వ్యక్తి వీధిలో అందరిముందు అవమానిస్తాడు. "ఇట్టా ఎంతకాలం తప్పించుకుంటావు భారతమ్మ. పోయిన గంగజాతర కి ఇస్తి. ఇప్పటిదాకా అసలు లేదు వడ్డీ లేదు" అంటూ ఆమెపై కేకలు వేస్తాడు.

దీంతో ఆ మరుసటి రోజు పుష్ప అతని డబ్బులు చెల్లించి "నీ లెక్క సరిపోయింది సరే. మరి నా లెక్క? మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెలిసింది. మరి అప్పు తిరిగి ఇచ్చేశామని ఊరంతా తెలియద్దా?" అని అతడిని కొట్టుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్లి పుష్పరాజ్ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు అని చెప్పిస్తాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

admin1

admin1

Next Story