Pushpa 2 Update: పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. భన్వర్ సింగ్ షెకావత్‌గా అదిరిన ఫహద్ ఫాజిల్ లుక్..

Pushpa 2 - Fahadh Faasil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే.

Arun Chilukuri
Published on: 8 Aug 2023 12:47 PM IST
Pushpa 2 The Rule Look of Fahadh Faasil Released on his Birthday
X

Pushpa 2 Update: పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. భన్వర్ సింగ్ షెకావత్‌గా అదిరిన ఫహద్ ఫాజిల్ లుక్..

Pushpa 2 - Fahadh Faasil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే..తెలుగులో కంటే హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పుష్ప మూవీ దుమ్ము దులిపేసింది. పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప విడుదల అయిన దాదాపు సంవత్సరానికి పుష్ప 2 ను మొదలెట్టారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ లుక్‌ను విడుదల చేసారు.

నేడు ఫహాద్ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప2’లో ఆయన లుక్‌ను మేకర్స్‌ విడుదల చేసి విషెస్‌ చెప్పారు. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు. ‘‘భన్వర్ సింగ్ షెకావత్ సర్.. ప్రతీకారంతో వస్తున్నారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిన్నటిదాకా ‘అప్‌డేట్ లేదా పుష్ప’ అంటూ అడిగిన అభిమానులు.. ఇప్పుడు ‘పార్టీ లేదా షెకావత్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పుప్ప 2 ది రూల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక ‘పుష్ప’లో ఫహాద్ ఫాజిల్‌.. ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో నిడివి తక్కువ పాత్ర చేసినప్పటికీ చివర్లో మెరిపించారు. క్లైమాక్స్‌లో ఆయన డైలాగులతో థియేటర్లలో ఈలలు వేయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story