Allu Arjun: మాస్ లుక్.. పుష్ప ది రూల్‌ గ్లింప్స్‌ వేరే లెవల్..

Allu Arjun: మాస్ లుక్.. పుష్ప ది రూల్‌ గ్లింప్స్‌ వేరే లెవల్..

Arun Chilukuri
Published on: 7 April 2023 4:58 PM IST
Pushpa 2 - The Rule Glimps Released
X

Allu Arjun: మాస్ లుక్.. పుష్ప ది రూల్‌ గ్లింప్స్‌ వేరే లెవల్..

Pushpa 2 Teaser: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం "పుష్ప: ది రూల్" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప ఎక్కడ' అంటూ విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది బుల్లేట్ గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ ఉత్కంఠను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story