Anasuya Bharadwaj-Pushpa - 2: "పుష్ప: ది రూల్" లో అనసూయ పాత్ర పెద్దదేనా

Anasuya Bharadwaj-Pushpa-2: సెకండ్ పార్ట్ లో అనసూయ పాత్ర మరింత హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది

admin1
Updated on: 25 Dec 2021 5:30 PM IST
Pushpa - 2 Movie Big Role for Anasuya Bharadwaj | Tollywood Latest News
X

"పుష్ప: ది రూల్" లో అనసూయ పాత్ర పెద్దదేనా

Anasuya Bharadwaj-Pushpa-2: భారీ అంచనాల మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా ఈ మధ్యన డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచే యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ, సునీల్, అజయ్ ఘోష్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ముఖ్య విలన్ మంగళం శీను పాత్రలో సునీల్ కనిపించగా అతని భార్య పాత్రలో అనసూయ తన పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించింది.

అనసూయ కనిపించింది కొన్ని సన్నివేశాలు అయినప్పటికీ చాలా విభిన్నమైన లుక్కుతో ఆకట్టుకుంది. అయితే మొదటి పార్టు ఆఖర్లో అనసూయ పాత్ర పగ తో రగిలి పోతూ ఉంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక సినిమా సెకండ్ పార్ట్ లో అనసూయ పాత్ర మరింత హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ముఖ్య విలన్ గా ఫాహద్ ఫాసిల్ కనిపించబోతున్నాడు. అనసూయ కి కూడా సినిమాలో మంచి పాత్రే ఉన్నట్లు అనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగిన ఈ కథ రెండో భాగం వచ్చే ఏడాది దసరా లేదా క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story