Raj Tarun: రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’.. డబ్బింగ్ పనుల్లో బిజీ

Purushothamudu: శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బేనర్ లో రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు' చిత్రం

Arun Chilukuri
Updated on: 25 Jan 2024 12:35 PM IST
Raj Tarun: డబ్బింగ్ పనుల్లో బిజీగా పురుషోత్తముడు
X

Raj Tarun: డబ్బింగ్ పనుల్లో బిజీగా 'పురుషోత్తముడు'

Purushothamudu: శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బేనర్ లో రాజ్ తరుణ్ హీరో గా రామ్ భీమన దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'పురుషోత్తముడు' చిత్రం రాజమండ్రి లో వేసిన భారి సెట్ లో టాకీ పూర్తి చేసుకున్న సంధర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు ఆదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు.

నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణం తో పాటు సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ పి.జి.విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story