Akash Puri: జిమ్ లో పనికి చేరితే గుర్తుపట్టేశారు..నన్ను తొక్కేస్తున్నారని ఫీలయ్యా..

Akash Puri: రామ్ చరణ్ తనకి హెయిర్ స్టైల్ సెట్ చేశారు అంటున్నా పూరి జగన్నాథ్ తనయుడు

Jyothi
Published on: 9 Jun 2022 5:51 PM IST
Puri Jagannath Son Says That Ram Charan Has Set a Hairstyle For Him
X

జిమ్ లో తనని గుర్తుపట్టేస్తారు అంటున్న ఆకాష్ పూరి

Akash Puri: పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి "మెహబూబా" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ "రొమాంటిక్" సినిమాతో పర్వాలేదు అనిపించాడు. తాజాగా ఇప్పుడు ఆకాష్ "చోర్ బజార్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గెహెనా సిప్పీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా "ఆలీతో సరదాగా" టాక్ షో లో ఆకాశ్ పాల్గొన్నాడు.

అందులో మాట్లాడుతూ మొదటి నుంచి తనకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అని, ఆ విషయాన్ని తన తండ్రికి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడినని అన్నారు. "నాన్న సినిమాల డైలాగ్స్ అన్నీ బట్టీ పట్టి పొద్దున్నే నాన్న నిద్ర లేవగానే చెప్పేసేవాడిని. నా మొదటి పారితోషికం ప్రకాశ్ రాజ్ గారి నుంచి తీసుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. సడన్‌గా ఫోన్‌ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను. నాన్నకి ఖాళీగా ఉండటం అస్సలు నచ్చదు. ఇంట్లో ఇలా ఖాళీగా ఉండొద్దు వెళ్లి ఏదైనా పని చూసుకో అని నాతో అన్నారు. అప్పుడు నేను వెళ్లి జిమ్ క్లీన్ చేసే పని చూసుకున్నాను. కానీ ఆ జిమ్ అతను నన్ను గుర్తు పట్టేశాడు.

నువ్వు పూరి గారి అబ్బాయివా? అని అడిగితే కాదని చెప్పాను" అని చెప్పుకొచ్చారు ఆకాష్. అంతే కాకుండా తనకి హెయిర్ కి జెల్ పెట్టుకోవడమంటే ఇష్టమని, ఆ జెల్ ను రామ్ చరణ్ దగ్గర చూసి పెట్టుకోవచ్చా అని అడిగితే ఆయన 'నీకు ఏ స్టైల్ కావాలో చెప్పారా' అని తన దగ్గర చైర్ వేసుకుని చాలా రకాల హెయిర్ స్టైల్స్ సెట్ చేశారు" అని అన్నాడు ఆకాష్.

Jyothi

Jyothi

Next Story