పూరి జగన్నాథ్ ఎవరిని హర్ట్ చేశారో తెలుసా.?

Ruthvik
Published on: 17 April 2019 3:53 PM IST
పూరి జగన్నాథ్ ఎవరిని హర్ట్ చేశారో తెలుసా.?
X

పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్ర దర్శకుల్లో ఒకరు. ఒక స్టార్ హీరో కి సమానం గా అతడిని ప్రేక్షకులు అభిమానిస్తారు. అయితే పూరి జగన్నాథ్ జంతు ప్రేమికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన పెంపుడు కుక్క చనిపోయింది అనే బాధ లో పూరి ఉన్నారు. ఇదే విషయమై తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో వెల్లడిస్తూ ఈ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒకానొక దశలో పూరి జగన్నాథ్ డబ్బులు లేని స్థితి లో కి వెళ్లిపోయారు. చేతిలో సినిమాలు సరిగా లేక, ఆర్థికంగా కూడా దెబ్బ తిన్న పరిస్థితి లో ఆయన తన పెంపుడు కుక్క జాక్స్ ని తన స్నేహితుడికి అమ్మేసారు.

తన దగ్గర డబ్బు లేక, తన కుక్క ని పెంచే స్థోమత లేక, పూరి ఈ పని చేశారు. అయిదేళ్ల తర్వాత కష్టాల నుండి కోలుకున్నాక పూరి మరలా తన కుక్క ని తాను తిరిగి తెచుకున్నారట. అయితే జాక్స్ మాత్రం మాట్లాడడం మానేసాడట. తనని వేరే వాళ్ళకి అమ్మేసినందుకు పూరి మీద కోపం తో ఈ రోజు వరకు పూరి దగ్గరకు వెళ్లలేదట. ఎప్పుడూ తనని చూసి తోక ఊపే జాక్స్ ఆ సంఘటన జరిగినప్పటి నుండి రెస్పాండ్ అవ్వడం మానేసాడట. ఇప్పుడు జాక్స్ చనిపోవడం తో ఆ బాధ లో ఈ విషయాన్నీ పంచుకుంటూ పూరి ఎమోషనల్ అవ్వడమే కాకుండా జాక్స్ ని హర్ట్ చేసినందుకు కుమిలి పోతున్నారు.

Ruthvik

Ruthvik

Next Story