పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలకి సీక్వెల్స్ ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్

Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు సినిమాలు చేశారు.

Arun Chilukuri
Published on: 24 Aug 2022 3:19 PM IST
Puri Jagannadh Wanted to Make Pokiri, Businessman Sequels
X

పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలకి సీక్వెల్స్ ప్లాన్ చేసిన పూరి జగన్నాథ్

Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు సినిమాలు చేశారు. అందులో మొదటిది "పోకిరి" కాగా రెండవది "బిజినెస్ మేన్". రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. తాజాగా "లైగర్" ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

2010 సమయంలో "పోకిరి" మరియు "బిజినెస్ మేన్" సినిమాలకి సీక్వెల్ ప్లాన్ చేశారట. కానీ ఆ సమయంలో మహేష్ బాబు బిజీగా ఉండటంతో కనీసం స్క్రిప్ట్ వినిపించే సమయం కూడా దొరకలేదని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. నిజానికి "బిజినెస్ మేన్" సినిమా తర్వాత కొన్నాళ్లపాటు పూరి జగన్నాథ్ ఫామ్ లో లేరు. మరి ఆ సమయంలో ఈ రెండు సినిమాలకి సీక్వెల్స్ వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇక ప్రత్యేకంగా "బిజినెస్ మేన్" సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని హిందీలో విడుదల చేసినా చాలా బాగుంటుందని అన్నారు పూరి. "బిజినెస్ మ్యాన్ డైలాగ్ బేస్డ్ సినిమా. హిందీ ప్రేక్షకులకు అది చాలా బాగా నచ్చుతుంది. ఈ ఐడియా మీద రీ వర్క్ చేసి సినిమాని హిందీలో చేయాలని అనుకుంటున్నాను," అని అన్నారు పూరి జగన్నాథ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story