Romantic: ఓటీటీలో విడుదల కానున్న ఆకాష్ పూరీ 'రొమాంటిక్' ?

Romantic: కోవిడ్ సెకండ్ వేవ్ తో రెండో ఏడాది కూడా సినీ ఇండస్ట్రీకి దెబ్బ తగిలింది.

Venkata Chari
Updated on: 17 May 2021 3:29 PM IST
Akash Puri ‍New Movie Romantic in OTT?
X

రొమాంటిక్ మూవీ ఓటీటీలో రానుందా? (ఫొటో ట్విట్టర్)

Romantic Movie: కోవిడ్ సెకండ్ వేవ్ తో రెండో ఏడాది కూడా సినీ ఇండస్ట్రీకి దెబ్బ తగిలింది. రిలీజ్‌కు రెడీ గా ఉన్న సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేసుకోగా, మరి కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల ఓటీటీలో విడుదలయి అలరిస్తున్నాయి.

తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ లెటెస్ట్ సినిమా 'రొమాంటిక్' కూడా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అనిల్ పాదూరి దర్శకత్వం వహించాడు. కాగా, ఈ సినిమాలో రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ సిద్దమైందని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు తగ్గే వరకు వెయిట్ చేయకుండా త్వరలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా మొదట అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుందనే వార్తలు రాగా, తాజాగా నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందంట. దీంతో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుందని టాక్ నడుస్తోంది. అయితే, అధికారిక సమాచారం త్వరలోనే విడుదల కానుంది.

పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో కలిసి ఛార్మి నిర్మించారు. పూరీ ఆకాష్ ఇంతవరకు విజయం రుచి చూడలేదు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ ను అందుకుంటాడా లేదో కొద్ది రోజుల్లో తెలియనుంది.

Venkata Chari

Venkata Chari

Next Story