Puri Jagannadh: విజయ్ కంటే ముందు ఈ హీరోతో సినిమా చేయనున్న పూరి

Puri Jagannadh Small Film Between Liger And Jana Gana Mana
x

Puri Jagannadh: విజయ్ కంటే ముందు ఈ హీరోతో సినిమా చేయనున్న పూరి

Highlights

Puri Jagannadh: విజయ్ దేవరకొండ ఇచ్చిన గ్యాప్ లో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్న పూరీ జగన్నాథ్

Puri Jagannadh: "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు పూరి. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదల సిద్ధమవుతోంది.

ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మళ్లీ విజయ్ దేవరకొండ హీరోగా "జనగణమన" అనే సినిమాతో బిజీ కాబోతున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్వాణ డైరెక్షన్లో "ఖుషి" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యకే "జనగణమన" సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పూరి జగన్నాథ్ ఒక చిన్న సినిమాని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

"మెహబూబా" సినిమాతో హీరోగా మారిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఆ తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలలో నటించారు. కానీ వాటితో మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఆకాష్ పూరితో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పూరి ఆకాష్ కి మంచి హిట్ అందిస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories