Puri Jagannadh: నెక్స్ట్ సినిమా విషయంలో ఇబ్బందులు పడుతున్న పూరి జగన్నాథ్

Puri Jagannadh: నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా ఇబ్బందులు పడుతున్న పూరి జగన్నాథ్

Dhatripriya
Updated on: 25 March 2023 6:30 PM IST
Puri Jagannadh Is Still Struggling For His Next Cinema
X

Puri Jagannadh: పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా కోసం జరుగుతున్న హీరో వేట..

Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే కాక డిజాస్టర్ సినిమాలు కూడా అందుకున్నారు. దాదాపు స్టార్ హీరోలు మరియు సీనియర్ హీరోలు అందరితోనూ కలిసి పని చేశారు పూరి జగన్నాథ్. "ఇస్మార్ట్ శంకర్" తో బ్లాక్ బస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన "లైగర్" సినిమాతో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్ ని అందుకున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ సినిమా దారుణంగా మిస్ ఫైర్ అయింది.

ఈ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై తను చేయబోతున్న తదుపరి సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. కానీ పూరీ జగన్నాథ్ మాత్రం ఇంకా తన తదుపరి సినిమా విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్న పూరి జగన్నాథ్ రామ్ చరణ్ కోసం ఒక కథని చెప్పారు. నిజానికి రామ్ చరణ్ ని "చిరుత" సినిమాతో హీరోగా లాంచ్ చేసింది పూరి జగన్నాథ్.

కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. రామ్ చరణ్ శంకర్ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు కానీ పూరి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు తక్కువే. అందుకే పూరి మళ్లీ రామ్ పోతినేని తో తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మరి పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తారు అని ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బాలయ్యతో కూడా పూరి జగన్నాథ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story