Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంట మరో విషాదం

Puneeth Rajkumar: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Updated on: 21 Feb 2022 2:53 PM IST
Puneeth Rajkumars father in law Bhagmane Revanath dies of a Heart Attack
X

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంట మరో విషాదం

Puneeth Rajkumar: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఈయన చనిపోయి నాలుగు నెలుల కూడా కాకముందే మరో మరణం ఆ ఇంటి సభ్యులను కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 78సంవత్సరాలు. బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో రేవనాథ్ తుదిశ్వాస విడిచారు.

పునీత్ రాజ్‌కుమార్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారిన పడడంతో గుండెపోటు వచ్చింది. ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. అల్లుడు పునీత్‌ లాగే రేవనాథ్‌ కూడా మరణానంతరం తన కళ్లను దానం చేశారు. ఇప్పటికే భర్త పోయిన బాధలో ఉన్న అశ్వినికి తండ్రి రేవనాథ్‌ మరణం తీరని లోటనే చెప్పాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story