Puneeth RajKumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు పూర్తి

* కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీడి వీడ్కోలు

Shilpa
Published on: 31 Oct 2021 9:31 AM IST
Puneeth RajKumar Funeral Completed in Kanteerava Studio
X

పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు పూర్తి(ఫైల్ ఫోటో)

Puneeth RajKumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్‌ అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్‌, తదితరులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

పునీత్‌ అన్న కొడుకు వినయ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా వేలాది మంది అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. చిన్నప్పటి నుంచి తాను ఎత్తుకొని ఆడించిన, ఇన్నాళ్లు తనకు తోడుగా ఉన్న తన సోదరుడు పునీత్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడంటూ శివ రాజ్‌కుమార్‌ గుండెలవిసేలా రోధించారు. మరోవైపు పునీత్‌ సతీమణి అశ్వినీ, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Shilpa

Shilpa

Next Story