Puneeth Rajkumar - Final Moments: పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు

Puneeth Rajkumar - Final Moments: భార్యతో కలిసి కారులో బయల్దేరిన వీడియో వైరల్...

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 4:34 PM IST
Puneeth Rajkumar Final Moments CCTV Visuals with His Wife Ashwini
X

పునీత్ రాజ్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

Puneeth Rajkumar - Final Moments: గుండెనొప్పితో కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆఖరి క్షణాల వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి ఆయన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా పునీత్ ఇంటిలోని సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కాస్త ఆందోళనగా ఉన్న పునీత్.. తన భార్యతో కలిసి బయటకు వెళ్తున్నట్లు వీడియోలో కినిపించింది.

జిమ్ చేస్తుండగా పునీత్‌కు అసౌకర్యంగా అనిపించింది. గుండెలో నొప్పిగా ఉండటంతో భార్య అశ్వినితో కలిసి తన ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి బయలుదేరారు. పునీత్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. అప్పుడు కూడా ఆయన పెద్దగా అస్వస్థతకు లోనైనట్టు కనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత భార్యతో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరు కారులో బయల్దేరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story