Puneeth RajKumar: మరణానికి ముందు కూడా వారి కోసం 8 కోట్లు డిపాజిట్ చేసిన పునీత్

*కుటుంబ సభ్యులకు తెలియకుండానే స్కూల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాధ శరణాలయాల కోసం 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునిత్

Sandeep Reddy
Published on: 10 Nov 2021 5:58 PM IST
Puneeth RajKumar Eight Crores Fixed Deposited For Old Age Homes And Schools
X

పునీత్ రాజ్ కుమార్ (ఫైల్ ఫోటో)

Puneeth RajKumar: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కేవలం 46 ఏళ్ల వయసు లోనే గుండెపోటు తో మరణించి తన కుటుంబాన్ని, కోట్ల మంది అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్వర్గస్తులై రెండు వారాలైన అతని అభిమానులు మాత్రం కుటుంబ సభ్యులతో పాటు ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా బాధ నుండి బయటపడలేకపోతున్నారు.

తాజాగా పునీత్ రాజ్ కుమార్ మరణించడానికి కొద్ది రోజుల ముందు తాను నడుపుతున్న 45 స్కూల్స్, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్, 26 అనాధ శరణాలయాలతో పాటు 19 గోశాలలు ఎలాంటి పరిస్థితిలో ఆగిపోకూడదని ముందుగానే పునీత్ 8 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన విషయం కూడా పునీత్ ఇంటి సభ్యులకు సైతం అతడు మరణించిన తరువాతే తెలుసని తెలిపారు.

ఇక పునీత్ మరణించిన నేత్ర దానంతో కన్నడ ప్రజలను ఎప్పుడు చూస్తూనే ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక పునీత్ నటించిన జేమ్స్ చిత్రం దాదాపుగా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఆ సినిమాని ఎలా విడుదల చేయాలో సినీ దర్శకుడితో పాటు నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story