Gandhada Gudi Teaser: పునీత్ రాజ్‌కుమార్ 'గంధ‌ద‌ గుడి' టీజర్ విడుదల

Sandeep Reddy
Published on: 7 Dec 2021 5:50 PM IST
Puneeth Rajkumar Dream Project Gandhada Gudi Teaser Released on 6th December 2021
X

Gandhada Gudi Teaser: కన్న‌డ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ 'గంధ‌ద‌ గుడి' టీజర్ విడుదల

Gandhada Gudi Teaser: కన్న‌డ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ప్రాజెక్ట్‌ 'గంధ‌ద‌ గుడి' సినిమాని త్వరలో విడుద‌ల‌ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 6న పునీత్ రాజ్ కుమార్ త‌ల్లి పార్వ‌త‌మ్మ జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుదల చేశారు. దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో పునీత్ సాహ‌సోపేత ప్ర‌యాణాన్ని చిత్రంలో చూడనున్నాము.

వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ అండ్ ఫిల్మ్‌ మేక‌ర్ అమోఘ‌వ‌ర్ష, పునీత్ రాజ్ కుమార్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రం తెరకెక్కింది‌. పునీత్ తండ్రి లెజెండ‌రీ యాక్ట‌ర్ డాక్ట‌ర్ రాజ్‌కుమార్ న‌టించిన ఒక పాపుల‌ర్ ఫిల్మ్ టైటిల్ కూడా 'గంధ‌ద గుడి' అవడం విశేషం. ఒక నిమిషం 20 సెకన్ల నిడివి వున్న ఈ టీజ‌ర్‌లో వైల్డ్‌ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ అమోఘ‌ వ‌ర్ష‌తో క‌లిసి పునీత్ అడ‌వుల‌ను శోధించ‌డంతో పాటు, వ‌న్య‌ప్రాణుల అద్భుత‌మైన విజువ‌ల్స్ ఉన్నాయి. "అప్పు క‌ల‌, ఒక అద్భుత‌మైన ప్ర‌యాణం, మ‌న భూమి, దాని గొప్ప‌త‌నానికి సంబంధించిన సెల‌బ్రేష‌న్‌, ఇది తిరిగివ‌చ్చే స‌మ‌యం" అని మేకర్స్ టీజర్ వీడియోలో తెలిపారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story