ఆమె ఇంకా పునీత్ రాజ్ కుమార్ బతికే ఉన్నారని అనుకుంటున్నారట

Puneeth Rajkumar Aunt Stil Unaware Of His Death
x

ఆమె ఇంకా పునీత్ రాజ్ కుమార్ బతికే ఉన్నారని అనుకుంటున్నారట

Highlights

Puneeth Rajkumar: కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్న సంగతి తెలిసిందే.

Puneeth Rajkumar: కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్ 29న ఉదయం 11 గంటలకి గుండెపోటు కారణంగా పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. అయితే పునీత్ ఇకలేరు అనే చేదు నిజం ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులలో ఒకరికి తెలియదట. ఇప్పటికీ పునీత్ బతికే ఉన్నారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు పునీత్ రాజ్ కుమార్ మేనత్త నాగమ్మ. పునీత్ అన్నా, శివరాజ్ కుమార్ మరియు రాఘవేంద్ర అంటే ఆమెకు పంచప్రాణాలు. ఈ మధ్యనే పునీత్ రెండవ అన్నయ్య రాఘవేంద్ర కు గుండెపోటు వచ్చిందని విషయం తెలుసుకున్న నాగమ్మ తట్టుకోలేక హాస్పిటల్ పాలయ్యారు.

ఇక ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన విషయం తెలిస్తే ఆమె అసలు తట్టుకోలేదు. అందుకే ఈ విషయాన్ని ఆమెకు చెప్పటం లేదని ఎప్పుడైనా ఆమె పునీత్ గురించి అడిగినా అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళారు అని అబద్ధం చెబుతున్నట్లు తెలుస్తోంది. తొంభై ఏళ్ళ నాగమ్మ ఇప్పటికీ పునీత్ రాజ్ కుమార్ బతికే ఉన్నారు అనే భ్రమలో బతుకుతున్నారు. ఇక మరోవైపు పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఆఖరి సినిమా జేమ్స్ థియేటర్లలో విడుదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories