ప్రముఖ దర్శకుడి తనయుడికి అనుకోని సమస్య

ప్రముఖ దర్శకుడి తనయుడికి అనుకోని సమస్య
x
Highlights

టాలీవుడ్ లో అగ్ర దర్శకుల లో ఒక్కరైన రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కొన్ని చిత్రాలలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు కానీ ఆ సినిమాలు...

టాలీవుడ్ లో అగ్ర దర్శకుల లో ఒక్కరైన రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి కొన్ని చిత్రాలలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహించారు కానీ ఆ సినిమాలు అన్నీ చేదు జ్ఞాపకాలే మిగిల్చాయి. ప్రకాష్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'మెంటల్ హై క్యా' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విషయంలో పెద్ద వివాదం సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ టైటిల్ డాక్టర్ ల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. మొదట నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు కాని ఆ వివాదం కాస్తా పెద్దది అవుతోంది.

'మెంటల్ హై క్యా' చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో సినిమా టైటిల్ మారిస్తే సినిమా పై బజ్ పోతుందేమో అని భయపడుతున్నారు యూనిట్ సభ్యులు. పైగా టీజర్, పోస్టర్స్ కూడా విడుదల చేశాక టైటిల్ మారిస్తే బాగోదు. అందుకే టైటిల్ ను మార్చకుండా ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో విజయం సాధించలేకపోయిన ప్రకాష్ కోవెలమూడి బాలీవుడ్ లో అయినా మంచి పేరు తెచ్చుకుంటాడో లేదో తెలియాలి. ఈ సినిమా జూన్ 21న విడుదల కావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories