RRR Tickets: ఆర్ ఆర్ ఆర్ టికెట్లు బుకింగ్ ఓపెన్ చేయబోతున్న దర్శకనిర్మాతలు

RRR Tickets: త్వరలోనే అమ్ముడవ్వనున్న "ఆర్ ఆర్ ఆర్" ప్రీమియర్ టిక్కెట్లు

admin1
Updated on: 15 Nov 2021 9:30 PM IST
RRR Movie, RRR Tickets, RRR Tickets Booking, Tollywood,
X
ఆర్ఆర్ఆర్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయనున్న నిర్మాతలు (ఫైల్ ఇమేజ్)

RRR Tickets: ప్రస్తుతం ప్రపచవ్యాప్తంగా సినిమా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని సినిమా థియేటర్స్ వారు అప్పుడే చిత్ర ప్రీమియర్ ల కోసం బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ని కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇక బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతాయి అని అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముతిరఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డి వీ వీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story