Rashmika Mandanna: రష్మిక కి సినిమాలు లేక పోవడానికి కారణం ఇదేనా?

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

admin1
Published on: 10 Nov 2021 12:15 PM IST
Producers Staying Away From Actress Rashmika Mandanna
X

Rashmika Mandanna: రష్మిక కి సినిమాలు లేక పోవడానికి కారణం ఇదేనా?

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. "నేషనల్ క్రష్" అనే పేరు కూడా తెచ్చుకున్న ఈమె వరుసగా స్టార్ హీరో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రష్మిక మందన కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇరు భాషల సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న మాత్రం ఇప్పటిదాకా ప్యాన్ ఇండియన్ సినిమాల్లో కనిపించింది లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు అంటే "పుష్ప" మాత్రమే.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కాకుండా శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాలో కూడా నటిస్తోంది రష్మీక. ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన రష్మిక మందన్న కొన్ని హిందీ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న హిందీ సినిమాలతో బిజీగా ఉంది" అని అనుకుంటూ తెలుగు నిర్మాతలు ఈమెను సంప్రదించడం లేదని అందుకే ఈమెకి ఆఫర్లు పెద్దగా రావడం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

admin1

admin1

Next Story