Bharateeyudu 2: "భారతీయుడు 2" కోసం రంగంలోకి దిగిన త్రిష

* కాజల్ స్థానంలో త్రిష ని తీసుకొచ్చిన దర్శకనిర్మాతలు

admin1
Published on: 16 Nov 2021 2:12 PM IST
Producers Selected Trisha in Place of Kajal Aggarwal for Bharateeyudu 2 Movie
X

"భారతీయుడు 2" కోసం రంగంలోకి దిగిన త్రిష(ఫైల్ ఫోటో)

Bharateeyudu 2: 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ "భారతీయుడు" బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ఆ సినిమా విడుదల అయినా దాదాపు పాతికేళ్ళ తర్వాత తాజాగా కమల్ హాసన్ మరియు శంకర్ కలిసి "భారతీయుడు-2" సినిమా ప్లాన్ చేశారు.

లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించనుంది. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కి మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు శంకర్ మీద కేసు కూడా వేశారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతోందని కొందరు అంటున్నప్పటికీ ఇంకా దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

అయితే ఇప్పుడు కాజల్ స్థానంలో కి దర్శకనిర్మాతలు సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ ను తీసుకు వచ్చారట. నిజానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా లో త్రిష హీరోయిన్గా నటించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల త్రిష కి బదులు కాజల్ ని ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు భారతీయుడు-2 సినిమాలో కాజల్ నటించాల్సిన పాత్ర త్రిష కి దక్కింది.

admin1

admin1

Next Story