Pushpa Movie: ప్రమోషన్స్ లో కూడా తగ్గేదే లే అంటున్న పుష్ప బృందం

Pushpa Movie: ప్రమోషన్స్ లో కూడా తగ్గేదే లే అంటున్న ఆ పుష్ప బృందం

Rama Rao
Updated on: 31 Jan 2022 7:38 PM IST
Producers Promoting The  Pushpa Movie with New Strategies | Telugu Movie News
X

ప్రమోషన్స్ లో కూడా తగ్గేదే లే అంటున్న ఆ పుష్ప బృందం

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎర్రచందనం నేపథ్యంలో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా "పుష్ప". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మరి కాసుల వర్షం కురిపించింది. సినిమా నుంచి విడుదలైన పాటలు అన్ని చార్ట్ బస్టర్లు గా నిలిచాయి. దీంతో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా సినిమాకి సంబంధించిన పాటలు, డైలాగులు మీద రీల్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా మిగతా భాషల్లో కూడా ఘన విజయాన్ని సాధించింది.

ముఖ్యంగా "పుష్ప" సినిమాకి బాలీవుడ్ లో మంచి ఆదరణ లభించింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను మరింత పెంచడానికి కావాలనే కొందరు సినీ ప్రముఖులతో శ్రీవల్లి పాట లేదా అల్లు అర్జున్ మ్యనరిజం లను ఇమిటేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్వయంగా పుష్ప ని ప్రమోట్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. చిత్ర బృందం మరియు అమెజాన్ ప్రైమ్ వారు ఇలాంటి మార్కెటింగ్ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ మరీ ఎక్కువైనా కష్టమే మరి "పుష్ప" విషయంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story