మోహన్ బాబు కామెంట్ లకి ఘాటుగా జవాబు ఇచ్చిన నిర్మాత

మోహన్ బాబు కూడా ఒక నిర్మాత అని గుర్తు చేయాలి అంటున్న సీ కళ్యాణ్

admin1
Updated on: 5 Jan 2022 5:01 PM IST
Producers Council President C Kalyan  Shocking Comments on Mohan Babu
X

మోహన్ బాబు కామెంట్ లకి ఘాటుగా జవాబు ఇచ్చిన నిర్మాత

C Kalyan: ఈ మధ్యనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందుల గురించి ఒక ఓపెన్ లెటర్ ని రాశారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రొడక్షన్ కౌన్సిల్ బాధ్యత తీసుకోవడం లేదని మోహన్ బాబు తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సీ కళ్యాణ్ మోహన్ బాబు పై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రొడక్షన్ కౌన్సిల్ లో ఐకమత్యం లేదు అనే వ్యాఖ్యలను కొట్టిపారేశారు కళ్యాణ్. టికెట్ ధరలు మరియు ఇతర ఇబ్బందుల గురించి నిరంతరం వారు గవర్నమెంటు తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

"మోహన్ బాబు గారికి ఆయన కూడా ఒక నిర్మాత అని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయన కొడుకు కూడా ఒక నిర్మాతే. మంచు కుటుంబం ఎప్పటినుంచో ఇండస్ట్రీతో కలిసి ఉంది. ఒకవేళ మేము ఇండస్ట్రీ ఇబ్బందులకు పరిష్కారం చూపించలేక పోతున్నామనిపిస్తే ఆయన ను మమ్మల్ని నడిపించమని కోరుతున్నాము. ఆయన వెనక నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు సి.కల్యాణ్. ఒక నిర్మాత అయ్యుండి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీద ఇలాంటి నిందలు వేయటం ఏమాత్రం సరికాదని కళ్యాణ్ వాదించారు.

admin1

admin1

Next Story