God Father: గాడ్ ఫాదర్.. ఏం జరుగుతోంది?

గాడ్ ఫాదర్ సినిమాతో రిస్క్ తీసుకోబోతున్న నిర్మాతలు

Arun Chilukuri
Published on: 15 Sept 2022 1:14 PM IST
Producers are Going to Take Risk With God Father Movie
X

God Father: గాడ్ ఫాదర్.. ఏం జరుగుతోంది?

God Father: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో "గాడ్ ఫాదర్" సినిమాపై కూడా బజ్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలకి సిద్ధమవుతోంది. కానీ ఈ సినిమా చాలా తక్కువ బజ్ ను మాత్రమే క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఇంకా సినిమా థియేట్రికల్ రైట్స్ ను లాక్ చేసే ప్రయత్నాల్లోనే ఉన్నారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోవడంతో చిత్ర నిర్మాతలు పూర్తిగా రిస్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకవైపు అసలే సినిమాకి బజ్ చాలా తక్కువగా ఉండగా మరొకవైపు ఈ సినిమాని నిర్మిస్తున్న సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు కూడా అంతా యాక్టివ్ గా ఉండరు. ఎన్ వి ప్రసాద్ మరియు ఆర్ బీ చౌదరి ఈ సినిమా విషయంలో ఆర్థికపరమైన రిస్క్ తీసుకోవాల్సి వస్తోంది. ఇక సినిమా హిట్ అయితే అటు నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాల్లో ఉంటారు. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్ల కంటే ఎక్కువగా నిర్మాతలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story